KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KONDA SUREKHA : తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈ మ‌ధ్య కాలంలో నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. దీంతో ఆమె వ‌ల్ల అటు కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి న‌ష్టాన్ని తీసుకొస్తున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. గ‌తంలో ఆమె సినీ న‌టుడు నాగార్జున కుటుంబ స‌భ్యుల‌తో పాటు స‌మంత‌పై చేసిన విమ‌ర్శ‌లు పెను దుమారాన్ని రేపిన విష‌యం తెలిసిందే.

Also Read : జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో శ్రీల‌క్ష్మీకి చుక్కెదురు

తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.రాజకీయాల్లో వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతార‌ని సెన్షేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఐఏఎస్ లు అవుతారు. అయినా చివ‌రికీ మా ముందు నిల్చొని.. మేము చెప్పింది వినాలి. అలా అని రాజ్యాంగంలో ఉంది. కాబ‌ట్టి మ‌నం ఏమి చేయ‌లేము. దీనిని విమ‌ర్శ‌గా తీసుకోవ‌ద్దు అంటూ చెప్పారు కొండా సురేఖ‌. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వార్షికోత్స‌వంలో మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్య‌లు చేసింది.

మ‌రోవైపు అడ‌వుల‌ను ర‌క్షించ‌డం, వాతావ‌ర‌ణ మార్పుల నియంత్ర‌ణ‌, జీవ వైవిధ్య సంర‌క్ష‌ణ‌లో నైపుణ్యం క‌లిగిన యూత్ ను త‌యారు చేయ‌డంలో ఎఫ్సీఆర్ఐ సంస్థ‌లో ముందు వ‌రుస‌లో ఉంద‌ని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాప‌కుల పోస్టుల భ‌ర్తీతో పాటు మౌళిక వ‌స‌తుల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంతో పాటు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌న్నారు. అదేవిధంగా పోటీ ప‌రీక్ష‌ల‌కు విద్యార్థులు సిద్ధం అవ్వాల‌ని సూచించారు. ఫారెస్ట్రీలో విస్తృత అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని తెలిపారు.

Also Read : Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇదే ?