
KAVITHA : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఏ నేత ఎప్పుడూ ఏపార్టీలో ఉంటున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరికొంత మంది బీఆర్ఎస్ ను వీడారు. అలా వీడిన వారిలో బీఆర్ఎస్ అధినేత కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఒకరు. KAVITHA
మాజీ సీఎం కేసీఆర్ కు అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ లీక్ కావడంతో ఆమె బీఆర్ఎస్ కి దూరంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు సైతం చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవు అని చెప్పకనే చెప్పారు. మరోవైపు తెలంగాణలో జాగృతి ప్రధాన ప్రతిపక్షంలో ఉంటుందని చెప్పారు. KAVITHA
Also Read: KAVITHA : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పిన మాటల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రస్తుతం కవిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. KAvitha
Also Read: ADI SRINIVAS PA : ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చనిపోవడానికి కారణం అతనేనా..?





