TRANSPORT : తెలంగాణలో భారీగా పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు.. ఉత్త‌ర్వులు జారీ..!

TRANSPORT : తెలంగాణ వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. కొత్త వాహ‌నాల పై మార్చి 01వ తేదీ నుంచి కొత్త వాహ‌నాల‌పై ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌న్ను పేరిట రూ.2వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు వ‌సూలు చేసేందుకు ర‌వాణా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. TRANSPORT

THE PRICES OF VEHICLES IN TELANGANA WILL INCREASE DRASTICALLY

ఈ పన్నుతో ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది రవాణా శాఖ. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను మెరుగు ప‌రిచే ల‌క్ష్యంతోనే ఈ ప్ను వ‌సూలు చేయ‌నున్నారు. TRANSPORT

Also Read : EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

ఈ కొత్త నిబంధ‌న మార్చి 01, 2026 నుంచి అమ‌లులోకి రానుంది. కార్లు, ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్లే ఆటోలు, ఇత‌ర నాన్- ట్రాన్స్ పోర్టు వాహ‌నాల‌పై ఈ ప‌న్ను వ‌ర్తించ‌నుంది. వాహ‌నాల రకాల‌ను బ‌ట్టి ప‌న్ను ఉండ‌నుంది. ద్విచ‌క్ర వాహ‌నానికి రూ.2వేలు, లైట్ మోటార్ వెహికిల్కి రూ.5వేలు, ఇత‌ర వాహ‌నాల‌కు రూ.10వేల చొప్పున సెస్ విధించ‌నున్నారు. కార్లు తేలిక‌పాటి వాహ‌నాల ప‌రిధిలోకి రానుండ‌గా.. ఇత‌ర వాహ‌నాల ప‌రిధిలోకి 4 నుంచి 7 సీట్ల సామ‌ర్థ్యం ఉన్న ఆటోలు వ‌స్తాయి. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈ ప‌న్నును త‌ప్ప‌నిస‌రిగ్గా చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ర‌వాణాశాఖ‌. TRANSPORT

Also Read : MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

Share your love