TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి సంబంధించిన కేసుల‌ను సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆయ‌నే వాదిస్తున్నారు. దీంతో మ‌రోసారి మ‌నుసింఘ్వీకి అవ‌కాశం ల‌భించింది.

Abhishek Manusinghvi and Vennarender Reddy as Rajya Sabha candidates from Telangana Congress have been finalized





నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేసేందుకు ఇప్ప‌టికే హైద‌రాబాద్ కి చేరుకున్నారు అభిషేక్ మ‌నుసింఘ్వీ. రెండో స్థానం కోసం తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేంన‌రేంద‌ర్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాజ్య‌సభ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 16 మంది పోటీ ప‌డ్డారు. వారిలో సీనియ‌ర్లే కాదు.. సూప‌ర్ సీనియ‌ర్లు సైతం ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ్య‌స‌భ‌ ఎంపీ అభ్య‌ర్థి అగ్ర‌నాయ‌క‌త్వంతో సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం న్యూఢిల్లీలో చ‌ర్చించారు. చివ‌రికీ వేం న‌రేంద‌ర్ రెడ్డి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపిన‌ట్టు స‌మాచారం.

Also Read : DONALD TRUMP : ట్రంప్ న‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ

మ‌రోవైపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఏ సామాజిక వ‌ర్గానికి టికెట్ ఇచ్చినా ఓడిపోయే సీటు ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు ఎదురు అవుతాయ‌ని గులాబీ పార్టీ ఆలోచిస్తోంది. పోటీపై బీఆర్ఎస్ డైలామాలో ప‌డింది. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ఫిరాయింపుల కార‌ణంగా 27కి ప‌డిపోయింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో విప్ జారీ చేయ‌డం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చెక్ పెట్టాల‌ని చూస్తోంది.

Also Read : KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!