
KONDA SUSMITA : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. కొంత మంది కొత్తగా రాజకీయ వారసులు ప్రవేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశంపై సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుస్తానని బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రేవంత్ రెడ్డి సన్నిహితుడు.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోందనే స్పష్టంగా అర్థమవుతోంది. KONDA SUSMITA
KONDA SUSHMITA GAVE JHALAK TO CM REVANTH REDDY
తల్లిదండ్రుల మాదిరిగానే తన రాజకీయ ప్రస్థానం పరకాల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు సుష్మిత. ఈ ప్రకటన చేసిన సమయంలో తండ్రి కొండా మురళీ పక్కనే ఉండటం విశేషం. సుష్మిత వ్యాఖ్యలకు తండ్రి కొండా మురళీ కూడా బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. తన కంటే సుస్మిత చాలా ధైర్యవంతురాలు అని.. కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కొంటుందని తెలిపారు. KONDA SUSMITA
Also Read : YOUNG GIRL : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. డెలివరీ అయిన ఇంటర్మీడియట్ అమ్మాయి
గత ఏడాది ఓఎస్డీ వివాదం సమయంలో రేవంత్ రెడ్డి పై సుస్మిత తీవ్ర విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మా నాన్నకు గన్ మెన్ల ను తొలగించి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. రెడ్లు అందరూ కలిసి బీసీ అయిన మా అమ్మను టార్గెట్ చేస్తున్నారంటూ మీడియా వేదికగా హల్ చల్ చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెను దుమారాన్నే సృష్టించాయి. మరోవైపు మంత్రి కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను సమర్థించారు. పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడంలో తప్పు లేదన్నారు. తన భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకునే హక్కు సుస్మితకు ఉందని పేర్కొన్నారు కొండా సురేఖ. KONDA SUSMITA
Also Read : IRAN- AMERICA : యుద్దం వల్ల అమెరికాకు అంత భారీ నష్టమా..?




















