
TTD CHAIRMAN : ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.దీంతో టీటీడీ చైర్మన్ ని సీఎం చంద్రబాబు మార్చుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ నాయుడు స్పందిస్తూ అవి డీప్ ఫేక్ వీడియోలు అని కొట్టి పారేశారు. తన కుటుంబంతో దాదాపు 30 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్న మహిళా అంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. TTD CHAIRMAN
ABN RADHAKRISHNA AS THE CHAIRMAN OF TTD
అయితే ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారంటూ పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ నాయుడు పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. అతని స్థానంలో ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కి టీటీడీ చైర్మన్ పదవీ అప్పగించనున్నట్టు సమాచారం. TTD CHAIRMAN
Also Read : TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..!
మరోవైపు బీ.ఆర్. నాయుడు వివాదంలో వైసీపీ నాయకులు మాత్రం బీఆర్ నాయుడు బాధితురాలు లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఈ లేఖను ఆమె సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కి పంపినట్టు సమాచారం. ఈ లేఖ గురించి వైసీపీ నేతలు మాట్లాడుతూ బీ.ఆర్. నాయుడు వ్యవహారం తెలిసే పదవి ఇచ్చారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
Also Read : DONALD TRUMP : ట్రంప్ నకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ




















