Elephant Tusks: ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్‌కు డీఎన్ఏ పరీక్షలు

ఏనుగు దంతాలు.. చిక్కుల్లో మోహన్‌లాల్ !

ప్రముఖ నటుడు మోహన్‌లాల్ మళ్ళీ ఏనుగు దంతాల కేసులో ఇరుక్కున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో, తాజాగా అధికారులు ఆయన వద్ద ఉన్న దంతాలు, విగ్రహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

మోహన్‌లాల్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఈ కేసులో, ఇటీవల అమలు చేసిన కేరళ శాఖ క్షమాభిక్ష పథకంలో భాగంగా ఆయన మరో ఆరు ఏనుగు దంతాలు, 13 విగ్రహాలు తన వద్ద ఉన్నట్లు అంగీకరించారు. ఇవన్నీ వారసత్వంగా వచ్చినవి లేదా బహుమతులుగా అందుకున్నవి అని ఆయన స్పష్టం చేశారు.

ఈ విగ్రహాలలో కృష్ణుడు, రాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుంది. అసలు ఇవి నిజంగా ఏనుగు దంతాలతో తయారు చేశారా లేదా తెలుసుకోవడానికి శాస్త్రీయ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

చట్టపరంగా అనుమతి లేకుండా ఏనుగు దంతాలు కలిగి ఉండటం నేరం. ఈ నేపథ్యంలో అధికారులు డీఎన్ఏ పరీక్షల ద్వారా నిజాన్ని వెలికితీయాలని నిర్ణయించారు. తన వద్ద ఉన్న వివరాలను స్వయంగా వెల్లడించిన మోహన్‌లాల్‌కు ఈ ఏనుగు దంతాల కేసు తదుపరి మలుపు ఎలా ఉంటుందో చూడాలి.