ఏపీలో ఎల్ నినో ప్రభావం: ఈ మూడు జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్!!

ఏపీలో ఎల్ నినో ప్రభావం రాబోయే రోజుల్లో మరింత తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల దాటినా వర్షపు చినుకు లేదు. మేఘాలు కూడా మొఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎల్ నినో ప్రభావం ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జూన్లో రాష్ట్రవ్యాప్తంగా -25 శాతం వర్షపాతం లోటు నమోదైంది. జూలైలో ఇప్పటివరకు -41 శాతం లోటు ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం -27 శాతం లోటుతో ముగిసే chance ఉందని officials చెబుతున్నారు. APలో మొత్తం 688 mandals ఉండగా, ఎల్ నినో 105 mandalsపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరో 208 mandals మధ్యస్థ స్థాయి ప్రభావంలో ఉండే అవకాశం ఉంది.

కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మధ్యస్థ స్థాయి ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. వీటితో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. రైతులు విత్తనాలు చల్లి మందుల కోసం ఎదురుచూస్తుండగా, ప్రస్తుతం నాలుగు చినుకుల కోసం తపించిపోతున్నారు.

ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు AP ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. జూన్ నుంచి నవంబర్ వరకు కొనసాగే ఈ సీజన్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి.

Share your love