లక్నోలో ఓ భార్య తన భర్తను మంచానికి కట్టేసి కొట్టడం, కరెంట్ షాక్ లు ఇవ్వడం వంటి దారుణం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జూలై 5న రాత్రి చోటుచేసుకుంది. గొడవ నేపథ్యంలో భర్తను కట్టేసి కొట్టింది అనే ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
సంజీవ్ తివారీ, అతని భార్య మధ్య ఆ రాత్రి గొడవ మొదలైంది. దాంతో ఆ మహిళ తన భర్తను రాత్రంతా మంచానికి కట్టేసి ఉంచింది. అంతేకాక, అతడిని కొట్టడంతో పాటు కరెంట్ వైర్లతో విద్యుత్ షాక్ లు కూడా ఇచ్చింది. ఈ సంఘటనలో సంజీవ్ కి తీవ్ర గాయాలయ్యాయి.
మరుసటి రోజు ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. సంజీవ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు సంజీవ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
సంజీవ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్ట్ చేశారు. ఈ కేసు లో దర్యాప్తు కొనసాగుతోంది. భార్య భర్తను మంచానికి కట్టేసి కొట్టడం అనే ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి గృహ హింస ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.





