బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు కేసులో పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. రావణ్ ఫోన్ లో పదుల సంఖ్యలో అశ్లీల వీడియోలు, బెదిరింపుల ఆధారాలు దొరికాయి. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యూఏపీఏ యాక్ట్ కింద కేసు నమోదుపై ప్రకాష్ రాజ్ వంటి సెలబ్రిటీలు సైతం ప్రశ్నలు వేస్తున్నారు. పోలీసులు రావణ్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, అందులోని డేటా ని విశ్లేషించారు.
ఈ ఫోన్ లో దొరికిన వీడియోలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. దాదాపు 10 మంది యువతులకు సంబంధించిన అశ్లీల వీడియోలు అందులో ఉన్నాయి. వారిని టార్గెట్ చేసి, బెదిరింపులతో వేధించినట్లు పోలీసులు గుర్తించారు. రావణ్ ఈ వీడియోలను చూపించి వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బాధితులంతా యువతులు కావడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు రావణ్ అకృత్యాలపై మరింత లోతుగా విచారణ జరపాలని డిసైడ్ అయ్యారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు.
రావణ్ కేసు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్‌గా ఉంది. యూట్యూబర్‌పై యూఏపీఏ యాక్ట్ వాడటం సముచితమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక వైపు ఈ చట్టపరమైన చర్చలు, మరోవైపు బాధితుల సంక్షేమం. పోలీసులు ఈ కేసును ఎంత వేగంగా డీల్ చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి.





UAPA చట్టంపై ABV వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు