కియా సోరెంటో హైబ్రిడ్ SUV లాంచ్ దగ్గర పడుతోంది. కొరియన్ కంపెనీ కియా భారత్‌లో రెండు కొత్త మోడళ్లను – బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (HEV) లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అయితే, పేర్లు మాత్రం ఇంకా రివీల్ కాలేదు. కానీ నివేదికల ప్రకారం, ఇవి కియా సిరోస్ EV మరియు మూడు వరుసల సీట్లు ఉన్న కియా సోరెంటో అని అంటున్నారు. Syros EV జూలై చివరి వారంలో లాంచ్ కానుంది, ఆగస్టులో మార్కెట్లోకి వస్తుంది. అసలు హైబ్రిడ్ మోడల్ అయిన కియా సోరెంటో 2026 దీపావళి నాటికి రోడ్లపైకి రానుంది.
కొన్ని డీలర్‌షిప్‌లలో కియా సోరెంటోకి అనధికారిక బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. టోకెన్ మొత్తం రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఈ SUV రేంజ్లో సెల్టోస్ కంటే పైన ఉండి, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, వోక్స్వ్యాగన్ టైరాన్ R-లైన్ వంటి monocoque SUVs తోపాటు, MG మెజెస్టర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి body-on-frame ప్రత్యర్థులతో పోటీపడుతుంది. ధర రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా. ఇండియా-స్పెక్ Kia Sorento కి పవర్‌ట్రెయిన్ వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.
నివేదికల ప్రకారం, సెల్టోస్‌లో ఉన్న 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ యొక్క హైబ్రిడ్ వెర్షన్ ఈ మోడల్లో వాడొచ్చు. ఈ హైబ్రిడ్ సిస్టమ్ 2027 నాటికి కియా సెల్టోస్లోనూ కనిపించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో కియా సోరెంటోలో 1.6L టర్బోచార్జ్డ్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మరియు స్టాండర్డ్ AWD ఉంటాయి. ఇది 5, 6 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.
ఇండియా వెర్షన్లో డ్యూయల్ డిస్ప్లే సెటప్, బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెథరెట్ అప్హోల్స్టరీ, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్ 2 ADAS, మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండొచ్చు. కియా సోరెంటో దాని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మరియు ప్రీమియం పొజిషనింగ్‌తో, పోటీ భారతీయ SUV మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ తీసుకోవాలని చూస్తోంది.





