Revanth Reddy: హోం మంత్రిగా సీఎం అట్టర్‌ఫ్లాప్‌… శాంతిభద్రతలు గాలికి

సీఎం రేవంత్ రెడ్డి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. హత్యలు, దోపిడీలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. మహిళలు, బాలికలకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. ఈ వైఫల్యం వల్ల పోలీస్ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

షాబాద్ లో ఇటీవల జరిగిన దారుణ ఘటన మరోసారి సీఎం హోం మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అని రుజువు చేసింది. బండి భగీరథ్ పోక్సో కేసు గుర్తు తెప్పించుకోకముందే ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళనకరం. NCRB నివేదిక ప్రకారం నాలుగు నేర విభాగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం సీఎం వైఫల్యాన్ని తెలియజేస్తోంది.

సీఎం రేవంత్ శాంతిభద్రతలపై సమీక్షలు మర్చిపోయారని, పోలీస్ శాఖను తన దగ్గరి వ్యక్తికి షాడో మంత్రిగా అప్పగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు అక్రమ సంపాదన, సెటిల్మెంట్లపై ఫోకస్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై నిఘా కరువైంది, గంజాయి నియంత్రణలో ఈగల్ ఆపరేషన్ ఫెయిలైందనే చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాలపై బూతుపురాణం లంకించుకోవడం కంటే శాంతిభద్రతలను మెరుగుపరిచేందుకు సీఎం సమయాన్ని వెచ్చించాల్సి ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. హోం మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది, దీనికి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు.

Share your love