Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం ప్రత్యేక హోదా!!

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

చంద్రబాబు కలల ప్రాజెక్టు అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పుడు కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ దక్కింది. కేంద్రం ఈ విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్-2025లో చేర్చి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచిందన్నమాట. కేంద్ర హోం శాస్త్రం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది.

Bhogapuram Airport Gets Special Status Now

ఈ స్పెషల్ స్టేటస్ వల్ల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఫండ్స్ వస్తాయి. అలాగే సమీప ప్రాంతాలను మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్లైట్ల రాకపోకలు కూడా ఈ విమానాశ్రయంలో సాగుతాయి. స్థానిక వ్యాపారాలకు మరియు కామర్స్ కు కూడా బాగా బూస్ట్ వస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో భోగాపురం పేరు ఇక నుంచి స్పెషల్ గా కనిపిస్తుంది.

ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తైపోయింది. జీఎంఆర్ కంపెనీ ఇప్పటికే ట్రయల్ రన్ కూడా చేసింది. కానీ ప్రారంభోత్సవానికి కాస్త delay అయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి పార్టీల మధ్య భాగస్వామ్యంలో ఇదొక బిగ్ ప్రాజెక్ట్ అవడం వలన మోదీనే ఓపెన్ చేస్తే better అనుకుంటున్నారు.

ప్రస్తుతం మోదీ షెడ్యూల్ క్లియర్ కాలేదు. వచ్చే నెల చివరికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించవచ్చని మంత్రులు అంటున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఆగస్టు 15 తర్వాత కానీ మోదీకి తీరుబడి దొరకదని తెలుస్తోంది. అందుకే ఆగస్టు నెలాఖరు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment