ప్రభాస్ ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 3 అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సలార్, కల్కి 2898 ఏడీ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన ప్రభాస్, హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ పీరియడ్ వార్ డ్రామా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. Fauji Release Date December 3. సీతారామం లాంటి క్లాసిక్ ఇచ్చిన హను, స్వాతంత్ర్యానికి ముందు నేపథ్యంలో ఈ కథను రెడీ చేస్తున్నాడు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ లేదా నవంబర్ కు వాయిదా పడుతుందనుకున్నా, ఇప్పుడు డిసెంబర్ 3 ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో పుష్ప, అఖండ లాంటి సినిమాలు డిసెంబర్ లోనే రిలీజయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదే సెంటిమెంట్ ను ఫౌజీ కూడా ఫాలో అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లు అని టాక్. ఫీజులు మరియు ప్రమోషన్లతో కలిపి ఈ అమౌంట్ వస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ దాదాపు రూ. 200 కోట్ల ఖర్చుతో 10 పెద్ద సెట్లు ఏర్పాటు చేశారు. సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డులు బద్దలవుతున్నాయి. సౌత్ లాంగ్వేజ్ OTT హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 180 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీ థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిలిమ్స్ సంస్థ రూ. 63 కోట్లకు సొంతం చేసుకుంది. హిందీ OTT హక్కుల డీల్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. త్వరలోనే చిత్రబృందం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అంచనా. ఫౌజీ రిలీజ్ డేట్ రివీల్ అయితే ఇండస్ట్రీలో పెను మార్పు రావొచ్చు.
[మరిన్ని వార్తలు చదవండి]
సాహు సినిమా రివ్యూ తెలుగులో
పుష్ప 3 అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్మెంట్
అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్





