రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన Fauzi సినిమా డిసెంబర్ 3, 2026న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ప్రభాస్ షర్ట్ లేకుండా, శరీరం మొత్తం బ్లడ్ తో నిండిపోయి ఉండటం అభిమానులను థ్రిల్ చేస్తోంది.
Fauzi Bloody Poster Viral
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇండిపెండెన్స్ కు ముందు నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేమ మరియు యుద్ధాన్ని కేంద్రంగా చేసుకుంది. ఆగస్టులో రిలీజ్ అవుతుందని చెప్పినా, షెడ్యూల్ మార్చి ఇప్పుడు డిసెంబర్ తేదీని ఫిక్స్ చేశారు. పోస్టర్ పై స్టాంప్ లో ‘అజ్ఞాత పర్వం’ మరియు ‘మోస్ట్ వాంటెడ్ 1932’ అనే రాతలు కనిపించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీని అర్థం ప్రభాస్ పాత్ర కోసం అందరూ వెతుకుతున్నారని, తిరుగుబాటు మొదలవుతుందని హింట్ ఇచ్చారు.
ఈ మూవీలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటులు కీలక రోల్స్ లో నటిస్తున్నారు. సంగీతం విశాల్ శేఖర్ అందిస్తుండగా, ఛాయాగ్రహణం సుదీప్ ఛటర్జీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభాస్ సరికొత్త లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేపింది. ‘రాజాసాబ్’ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఫౌజీపై ఫోకస్ చేసిన ప్రభాస్, ఈ చిత్రంతో భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. పోస్టర్ వైరల్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ కొత్త పోస్టర్ తో సినిమా బజ్ మరింత పెరిగింది. ఇక ఫౌజీ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.





