నాని అభిమానులకు ఇప్పుడు ఒకటే టెన్షన్. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ విడుదల తేదీ విషయంలో వచ్చిన నిరాశ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. మార్చి 19 నుంచి ఆగస్ట్ 21కి షిఫ్ట్ అయిన ఈ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. నాని కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ ఈ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ది ప్యారడైజ్ new updates delay
రాఘవ్ జయల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ ఆశలు పెంచుకున్నారు. కానీ షూటింగ్ స్లోగా జరుగుతుండటం, టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉండటం వంటి విషయాలు రిలీజ్ డేట్ ను లాగేస్తున్నాయి. ఆగస్ట్ 21న రవితేజ ‘ఇరుముడి’ కూడా రిలీజ్ కావడంతో ప్యారడైజ్ తప్పుకుంటే సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే మూవీ టీమ్ ఓవర్సీర్ డిస్ట్రిబ్యూటర్స్‌కు అప్‌డేట్ ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 24 నుండే ప్రీమియర్స్ ఉంటాయని కూడా న్యూస్ వైరల్ అవుతోంది. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్‌గా ఏమీ అనౌన్స్ చేయలేదు. ఫ్యాన్స్ వాయిదాలతో విసిగిపోయారు, ఒక క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.
నాని సినిమాను ప్యాన్ ఇండియా వైబ్స్ తో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వాయిదాల వల్ల అభిమానుల్లో నిరాశ ఏర్పడింది. ఇప్పుడు సెప్టెంబర్ డేట్ ఫిక్స్ అవుతుందా లేదా అనేది చూడాలి. నాని ఫ్యాన్స్ ఒక్కసారి తమ స్టార్ వైపు చూస్తున్నారు.





