రవితేజ ‘ఇరుముడి’ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది, ఇది తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమ, భక్తి, భావోద్వేగాల కథ. ఈ చిత్రంలో రవితేజ పాత్రకు వెనుక ఒక డార్క్ పాస్ట్ ఉంది, కానీ ప్రస్తుతం ఆయన అయ్యప్ప దీక్షతో సాత్విక జీవితం గడుపుతున్నాడు. అయితే, గతంలో జరిగిన రక్తపాతం ఆయనను మళ్ళీ వేధిస్తూ కూతురు life కూడా ప్రమాదంలో పడటంతో స్టోరీ ట్విస్ట్ తీసుకుంటుంది.
Raviteja Irumudi Emotional Family Drama
ఈ మూవీ ఆరంభంలోనే ఒక బ్రూటల్ మాస్ యాక్షన్ సీన్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుందంటున్నారు ఇండస్ట్రీ ఇన్‌సైడర్లు. రవితేజ ఈ సీన్‌లో తన పాత్రలోని క్రిమినల్ యాంగిల్ ని చాలా ఇంటెన్స్‌గా చూపించారని, అక్కడి నుంచి కథ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీగా సాగుతుందని సమాచారం. ఆయన కూతురు మణమ్మ కోసం మాఫియా లైఫ్‌ని వదిలేసి, ఫ్యామిలీతో పీస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. కానీ పాత శత్రువులు వెంటపడటం వల్ల సిచ్యుయేషన్స్ మారిపోతాయి.
రవితేజ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు డబ్బింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదల చేసిన ఒక డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “నాకు ఒకే ఒక్క కూతురు.. పేరు మణమ్మ” అంటూ ఆయన పలికిన డైలాగ్ చూస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక లెఫ్టోవర్ వర్క్ విషయానికొస్తే మూడు రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ సైతం ఫాస్ట్‌గా జరుగుతోందని మేకర్స్ చెప్తున్నారు.
ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ flicks లో రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్రం నటిస్తోంది, హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ ఉన్నారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూస్ అవుతోంది. సినిమా మొత్తం ఒక హార్ట్ టచింగ్ జర్నీగా సాగనుంది, రవితేజ ఇందులో ఎమోషనల్ లెవల్‌లో చాలా హై రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని టాక్.





