Toyota Hilux: India లో Toyota Hilux లాంచ్ ఎప్పుడంటే? మంచి డిజైన్, అదిరిపోయే ఫీచర్లు..!!

జపాన్ దిగ్గజం టయోటా తమ పాపులర్ పికప్ ట్రక్ Toyota Hilux ను జూలై 28, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ Hilux కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో మరింత అగ్రెసివ్ లుక్‌లో రానుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో బ్రాంజ్ కలర్‌లో ఉన్న ఈ ట్రక్ ముందు భాగంలో పెద్ద హనీకోంబ్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఆకట్టుకుంటున్నాయి.

Toyota Hilux New Look

ఈసారి డిజైన్‌లో స్పోర్టీ ఎలిమెంట్స్‌కు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, రోల్ బార్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు Hilux ను మరింత బోల్డ్‌గా మారుస్తాయి. ఇంటీరియర్ విషయానికొస్తే, డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్‌లో వచ్చే ఈ ట్రక్‌లో 12.3-అంగుళాల డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, లెదర్ స్టీరింగ్ వీల్, టయోటా స్మార్ట్ ఆప్ట్ ఫీచర్లు ఉండవచ్చు.

ఇంజన్ పరంగా, 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజన్ కొనసాగే చాన్స్ ఉంది. ఇది 204 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లో 420 Nm టార్క్, ఆటోమెటిక్ వేరియంట్‌లో 500 Nm టార్క్ లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కానీ, భారత వెర్షన్‌లో ఆ ఫీచర్ ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

ధర విషయానికొస్తే, ప్రస్తుత మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.52 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు ఉంది. కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్ల కారణంగా కొత్త Hilux ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. జూలై 28న ఈ పికప్ ట్రక్ అధికారిక లాంచ్ తర్వాత ధర, ఇతర వివరాలు వెల్లడవుతాయి.

Share your love