జగన్ vs చంద్రబాబు గొడవ మళ్లీ మొదలైంది. భీమవరంలో ఆక్వా రైతుల సభలో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని దున్నపోతు పోలికతో విమర్శించిన జగన్ ఆ పోలిక సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Jagan Chandrababu Govt Buffalo Analogy
చంద్రబాబుగారి చర్మం మందం అందరికీ తెలుసు. దున్నపోతు మీద వర్షం పడితే అది చలించదు. ఇప్పటి ప్రభుత్వం కూడా అంతే అని జగన్ అన్నారు. ఈ మాటలతో ఆయన చంద్రబాబు ప్రభుత్వం సామాన్య ప్రజల సమస్యలను సీరియస్గా తీసుకోవడం లేదని ఎత్తి చూపించారు. రాష్ట్రంలో ఆక్వా రంగం డీలా పడిపోయిందని, ధరలను కొంతమంది సిండికేట్ చేతిలో కేంద్రీకరించారని ఆరోపించారు.
గతంలో కూడా చంద్రబాబును ఉరి తీసినా ఫర్వాలేదు అంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దున్నపోతు పోలికతో మరో వివాదం మొదలైంది. జగన్ మాట్లాడుతూ, ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలన్నీ చంద్రబాబు సానుభూతిపరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అందరూ కలిసి రైతులను దోచుకుంటున్నారు అని ఫైర్ అయ్యారు. తన హయాంలో ఏపీకి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు రావడాన్ని గుర్తు చేశారు.
మూడేళ్లలో మళ్లీ రైతు ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఆక్వా రంగానికి పూర్తి మహత్వం తీసుకొస్తాము, సిండికెట్ వ్యవస్థను నాశనం చేస్తాము అని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఇక అక్కడ ఉన్న ఆక్వా రైతులు కూడా జగన్ మాటలకు స్పందించారు. ఈ నెల 15 నాటి ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.





