
ఏపీలో స్థానిక ఎన్నికలకు సెప్టెంబర్ లో రంగం సిద్ధం అవుతోంది. ఈ లోకల్ బాడీ పోల్స్ కోసం కూటమి ప్రభుత్వం ప్లానింగ్ మొదలు పెట్టింది. అధికారం, విపక్ష వైసీపీ మధ్య ఎప్పుడూ వాగ్యుద్ధం నడుస్తూనే ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది.
సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలకు రంగం
ఈ సారి స్థానిక ఎన్నికలు ఒకేసారి అన్ని స్థాయిల్లో జరగనున్నాయి. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు వరుసబెట్టి ఎన్నికలు నిర్వహించే ప్లాన్ ప్రభుత్వం సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికలు ముందు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనకు టెస్ట్ గా భావిస్తోంది.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పట్టణాల్లో మంచి క్రేజ్ ఉంది. కానీ విపక్ష వైసీపీకి గ్రామాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కూటమి పార్టీలు వర్క్ షాపులు నిర్వహిస్తున్నాయి. ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేయాలనే ప్లాన్ తయారు చేశాయి. 27 నుంచి 45 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ జరగనుంది.
విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంతో పాటు ఎన్నికల్లో బెస్ట్ రిజల్ట్స్ కోసం కూటమి సర్కారు వ్యూహాలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ఒక రకంగా శాంపిల్ గా మారనున్నాయి. అందుకే ఈ పోరును రెండు వైపులా గ్రాండ్ ప్లానింగ్తో ఎదుర్కోవాలనేది పొలిటికల్ పార్టీల లెక్క.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





