వోల్వో EX90 2026 ఆగస్టు 19న భారత్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV లగ్జరీ, టెక్నాలజీ, మరియు భద్రతల కలయికగా నిలుస్తుంది. కంపెనీ రెండో EVగా వచ్చే ఈ కారు 602KM WLTP రేంజ్ మరియు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.
Volvo EX90 భారత్ లాంచ్
ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది – 92kWh RWD మరియు 106kWh AWD. పర్ఫార్మెన్స్ వేరియంట్ 680 హెచ్పీ, 870 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చి కేవలం 4 సెకన్లలో 0-100 స్పీడ్ అందుకుంటుంది. రేంజ్ విషయంలో 106kWh బేస్ వేరియంట్ 608 కిమీ నడిచేస్తే, పర్ఫార్మెన్స్ వేరియంట్ 602 కిమీ ప్రయాణించడం కంప్లీట్ చేస్తుంది. 800V ఆర్కిటెక్చర్ త్వరగా చార్జ్ చేయడంలో సహాయం చేస్తుంది.
ఇంటీరియర్ మినిమలిస్టిక్ డిజైన్‌తో హైటెక్ ఫీచర్లు నిండి ఉంటుంది. 14.5-అంగుళాల Google ఆధారిత స్క్రీన్, 9 డిజిటల్ డిస్‌ప్లే, 13.2 హెడ్-అప్ డిస్‌ప్లేతో మొత్తం క్యాబిన్ అత్యాధునికంగా ఉంటుంది. ఫిజికల్ బటన్లు చాలా తక్కువ, ఫ్లోటింగ్ కన్సోల్, పనోరమిక్ సన్‌రూప్ వంటి ఫీచర్లు ప్రీమియం లగ్జరీని తెస్తాయి. 5G కనెక్టివిటీ మరియు OTA అప్‌డేట్లు అదనంగా జోడించాయి.
భద్రతలో Volvo EX90 కొత్త బెంచ్‌మార్క్ సృష్టించింది. Leval-3 ADAS, V2L సపోర్ట్, మరియు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థలతో 5-స్టార్ రేటింగ్ సంపాదించింది. భారత మార్కెట్లో ఇది Mercedes-Benz EQS SUV, BMW iX, Audi Q8 e-tron మరియు Kia EV9 వంటి ప్రీమియం EVలతో పోటీ పడుతుంది. వీటి కంటే ఎక్కువ రేంజ్ మరియు తక్కువ ధర ఉంటే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.





