Jabardasth Satya Sri : విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ చెల్లి

జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన లేడీ కమెడియన్ సత్యశ్రీ ఇప్పుడు గర్వంగా ఫీలవుతోంది. ఎందుకంటే ఆమె సొంత చెల్లి కీర్తిశ్రీ, స్కైరూట్ ఏరోస్పేస్ చేసిన తొలి ప్రయోగంలో కీలకమైన ఇంజనీర్గా పనిచేసింది. నిన్న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ సక్సెస్ఫుల్గా నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలో Jabardasth Satya Sri sister Keerthi Sri కూడా టీమ్లో భాగం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

Jabardasth Satya Sri Sister Role

సత్యశ్రీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన చెల్లి కీర్తిశ్రీ ఏరోస్పేస్ సెంటర్లో విక్రమ్-1 రాకెట్ మీద వర్క్ చేస్తున్నప్పటి ఫోటోలు షేర్ చేసింది. నా చెల్లి చిన్నప్పుడు నక్షత్రాల్ని ఆశ్చర్యంగా చూసేది. ఇప్పుడు ఆ నక్షత్రాల దిశగా ప్రయాణించే రాకెట్ను బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తోంది. ఆమె ఒక ఏవియానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్గా పనిచేసింది. ఆమె చేసిన ప్రతి టెస్ట్, చెక్ చేసిన ప్రతి వైర్, ఈ మొత్తం మిషన్ను ఆకాశానికి మరింత దగ్గర చేసింది అని రాసుకొచ్చింది.

ఈ ప్రయోగం కోసం చాలా రోజుల పాటు టీమ్ ఎంతో డెడికేషన్తో వర్క్ చేసిందట. కౌంట్డౌన్కు ముందు లెక్కలేనన్ని గంటలు టెస్ట్లు నిర్వహించారు. సత్యశ్రీ తన పోస్ట్లో స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్ మొత్తానికి, సైంటిస్టులకు, టెక్నీషియన్స్కి థాంక్స్ చెప్పింది. వారి ప్యాషన్, ఇన్నోవేషన్, టీమ్ వర్క్ కలల్ని నిజం చేశాయి. ఆ ఇంజనీర్లందరిలో నా చిన్నారి ప్రిన్సెస్ కూడా ఉండడం నిజంగా గ్రేట్ అంటూ ఆమె తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

విక్రమ్-1 రాకెట్ మీద తన చెల్లి సంతకం చేస్తున్న ఫోటో చూసి తనకు చాలా proudగా అనిపించిందని సత్యశ్రీ రాసింది. మిషన్ ఆగమన్ ఒక చారిత్రాత్మక ఈవెంట్. ఇది చాలా మైలురాళ్లకు తొలి అడుగు కావాలి అని ఆశించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లేడీ కమెడియన్గా జబర్దస్త్ నుంచి సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న సత్యశ్రీకి, స్పేస్ ఇంజనీర్గా సక్సెస్ అవుతున్న కీర్తిశ్రీకి అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

Share your love