Chennai Love Story: ఎన్నడూ చూడని ప్రేమకథ అంటూ అల్లు అరవింద్ ప్రశంస

సినిమా ప్రియులకు ఓ కొత్త ట్రీట్ రెడీ అవుతోంది. మనం ఎప్పుడూ ఊహించని విధంగా సాగే ఫ్రెష్ లవ్ స్టోరీ “ Chennai Love Story ”. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, “ట్రైలర్ సూపర్బ్‌గా ఉంది. కేవలం 104 డేస్‌లో కంప్లీట్ చేశారంటే టీమ్ మీద నమ్మకం ఉండి డేర్ చేశారనే కదా అర్థం. ఆ కాన్ఫిడెన్స్‌తోనే పోస్టర్‌పై కల్ట్ క్లాసిక్ అని రాసుకున్నారు. ఈ టీమ్ టాలెంట్ నాకు తెలుసు, కచ్చితంగా హిట్ కొడతారు” అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక సినిమా విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ లవ్ టేల్‌కు రవి నంబూరి దర్శకత్వం వహించారు.

Chennai Love Story Movie Trailer

“బేబీ” ఫేమ్ సాయిరాజేశ్ ఈ సినిమాకు కథ రాసి, ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టడం మరో హైలెట్. మణిశర్మ ఎప్పటిలాగే ట్యూన్‌ఫుల్ మ్యూజిక్‌తో సౌండ్‌లో మ్యాజిక్ చేశారు. ఈ ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. దర్శకుడు రవి నంబూరి స్టేజి మీద తన ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ, “ఐక్లెమాక్స్ సీన్ ఈ మూవీకి హార్ట్ లాంటిది. దాన్ని పర్ఫెక్ట్‌గా తీయడానికి విపరీతమైన హార్డ్‌వర్క్ చేశాను. తలమీద ఇరుముడి మోసిన భక్తుడు, ఆ భారం దించేసిన తర్వాత ఎంత రిలీఫ్ ఫీలవుతాడో, ఇప్పుడు నా కండిషన్ కూడా అదే. ట్రైలర్ చూస్తే సినిమాపై మీ ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది. తెరపై చూసి మీరు షాక్కి గురవడం పక్కా” అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌పై తనకున్న నమ్మకాన్ని బయటపెట్టారు. “కథ వినగానే ఇందులో ఏదో మ్యాజిక్ జరగబోతుందని నమ్మేశాను. ఇది మీరు ఇంతకు ముందెప్పుడూ చూడని డిఫరెంట్ లవ్ స్టోరీ. థియేటర్లోంచి బయటకు వచ్చినా మీరు ఆ ఫీలింగ్ లోనే ఉండిపోతారు. లైటర్‌వీన్ లైఫ్‌లో మీకు చాలా సర్‌ప్రైజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమా చూస్తూ ‘ఇంత బాగుందేంట్రా’ అనుకుంటారు” అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. శ్రీగౌరి ప్రియ తన రోల్ గురించి ఎక్సయిట్‌మెంట్ షేర్ చేసుకుంది. ఈవెంట్‌లో మైత్రీ రవిశంకర్, సాయిరాజేశ్, నిర్మాత ధీరజ్ మొగిలినేని తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ కోసం విషెస్ చెప్పారు.

యూత్‌కి నచ్చే ట్రెండీ లవ్ సబ్జెక్ట్‌ను తీసుకుని, పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్‌తో వస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఎంక్వైరీ పెరుగుతోంది. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్‌తో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ, మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషనల్ కనెక్ట్‌ను పట్టుకునేలా డిజైన్ చేశారు. మామూలు లవ్ స్టోరీలా కాకుండా, ట్విస్ట్‌లు, టర్నింగ్‌లతో కూడిన ఈ జర్నీ ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఆ రోజు థియేటర్‌లో పడబోయే హడావుడి, ఆ తర్వాత వచ్చే టాక్‌ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Share your love