హైదరాబాద్ లో జరిగిన ఓ జూమ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనస్తాపం కలిగించాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ‘సర్’ మెంబర్షిప్ డ్రైవ్ చాలా slow గా సాగుతోందని, మరీ ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో enrollments చాలా తక్కువగా ఉన్నాయని సీఎం నేరుగా ప్రస్తావించారు. ఈ మాటలు ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్‌ను బాగా నొప్పించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఉత్తమ్ Reaction On Revanth Comments
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జూమ్ కాల్ లో సీఎం మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ‘సర్’ నమోదు ప్రక్రియ అంత వేగంగా లేదని, ముఖ్యంగా హుజూర్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు నేరుగా తనని టార్గెట్ చేసి చేసినవిగా ఉత్తమ్ భావించినట్టు సమాచారం. స్థానికంగా ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే, సీనియర్ నేత అయిన తన గురించి బహిరంగ meeting లో సీఎం ఇలా specific గా ఎందుకు అన్నారో అర్థం కాలేదని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
ఈ ఆదివారం జరిగిన ఈ virtual meeting లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు వంటి కీలక నేతలందరూ పాల్గొన్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే పది రోజుల్లో పార్టీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్లు గణనీయంగా పెరగాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరింత active గా field లోకి దిగి కార్యకర్తలను register చేసేలా చూడాలని ఆదేశించారు. నల్గొండ, యాదాద్రి జిల్లాలు మాత్రం ఈ విషయంలో ముందంజలో ఉన్నాయని ఆయన ప్రశంసించారు.
అయితే, ఈ మీటింగ్‌లో సీఎం మరో కీలక ఆదేశం కూడా ఇచ్చారు. సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు ఏ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా గాంధీభవన్‌కు రావొద్దని, ఆయా రోజుల్లో పదవుల ఆశతో వచ్చేవారికి సీనియర్లెవరూ appointment ఇవ్వొద్దని కట్టుదిట్టమైన సూచన చేశారు. దీంతో, మంత్రి ఉత్తమ్ మనస్తాపంతో పాటు, ఈ కొత్త ఆదేశం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.





