అనుపమ పరమేశ్వరన్: ధృవ్ విక్రమ్ బ్రేకప్ రూమర్స్ అసలు నిజమేంటి?

అనుపమ పరమేశ్వరన్ పేరు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి కారణం ఆమె పర్సనల్ లైఫ్. తమిళ నటుడు ధృవ్ విక్రమ్ తో అనుపమ బ్రేకప్ అయ్యారనే రూమర్స్ బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ జంట కలిసి నటించిన ‘బైసన్’ సినిమా తర్వాత వీరి మధ్య ప్రేమ ఉందని అప్పుడే వార్తలొచ్చాయి. కానీ ఇద్దరూ ఆ ప్రేమ గురించి అధికారికంగా ఒప్పుకోలేదు. ట్రూ లవ్ లాగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ వార్తలు రావడం అభిమానులను షాక్ లో ముంచేసింది.

Anupama Parameswaran Breakup Rumors Explained

ఇటీవల అనుపమ తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన కొన్ని పోస్టులు ఈ బ్రేకప్ రూమర్స్ కు ఆజ్యం పోశాయి. ముఖ్యంగా ఆమె ధృవ్ విక్రమ్ ను అన్‌ఫాలో చేయడం, కొన్ని ఎమోషనల్ పోస్టులు షేర్ చేయడంతో ఫ్యాన్స్ కు అనుమానం మొదలైంది. అలాగే చెన్నైలోని ఓ హోటల్ లో వీరిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే రిలేషన్ షిప్ పూర్తిగా ముగిసిపోయిందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయానికి ఎలాంటి ఆఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు.

అనుపమ ఇటీవల పోస్ట్ చేసిన ఓ స్టేటస్ కూడా ఈ రూమర్స్ ను మరింత హెచ్చించింది. ‘ఇకపై ఎవరి అనుమతి అవసరం లేదు, ఎలాంటి భయం లేదు’ అని ఆమె రాయడంతో అది పర్సనల్ లైఫ్ కి సంబంధించిందేమోనని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజంగా బ్రేకప్ ను ఇండికేట్ చేస్తుందా లేక వేరే సందర్భంలో చేసిన స్టేట్మెంట్ అనేది క్లియర్ కాలేదు. అసలు ఇందులో నిజమెంతో తెలియాలంటే కచ్చితంగా స్టార్స్ నుంచే స్పందన రావాలి.

ప్రస్తుతానికి అనుపమ పరమేశ్వరన్ మరియు ధృవ్ విక్రమ్ ఇద్దరూ ఈ వార్తలపై మౌనంగా ఉన్నారు. అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఎవరైనా స్పందించే వరకు ఈ బ్రేకప్ వార్తలు కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. అభిమానులు మాత్రం క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు చూడాలి ఈ జంటలో ఎవరైనా మౌనం వీడి నిజం చెబుతారేమో.

Share your love