PV Sindhu: రాజమౌళికి పీవీ సింధు స్పెషల్ రిక్వెస్ట్ – నన్ను హీరోయిన్‌గా తీసుకోండి

పీవీ సింధు స్టార్ షట్లర్ కావడం మాత్రమే కాదు, ఇప్పుడు సినిమా హీరోయిన్ అవ్వాలని కూడా ఆసక్తి చూపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళితో సోషల్ మీడియాలో జరిగిన చిన్న సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. జపాన్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఆమెను అభినందిస్తూ వాట్ ఏ ఛాంపియన్ కమ్‌బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. దానికి సింధు సరదాగా, థ్యాంక్యూ సో మచ్ సర్. మీ వారణాసి సినిమా కోసం చాలా ఆసక్తిగా ఉన్నాను. మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే, మీ కొత్త హీరోయిన్‌గా నటించడానికి సంతోషిస్తాను అంటూ రిప్లై ఇచ్చింది.

PV Sindhu’s Rajamouli Movie Request

ఈ కామెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సింధు నిజంగా సినిమా ఎంట్రీ ప్లాన్ చేస్తోందా, లేక సరదాగా మాట్లాడిందా అనే చర్చ మొదలైంది. రాజమౌళి తన సినిమాలకు అరుదుగా క్రీడాకారులను హీరోయిన్స్‌గా తీసుకుంటారు, కానీ సింధు అడిగిన తీరు చాలా cute గా ఉంది. మరి రాజమౌళి ఆమె కోరికను తీరుస్తారా? ఇది తెలియాలంటే వారణాసి రిలీజ్ వరకు ఆగాలి.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ మూవీలో మహేశ్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సింధు రాజమౌళితో తన interest ను express చేయడం ఇప్పుడు ఫ్యాన్స్‌కి మరింత హైప్ ను add చేస్తోంది.

Share your love