
Rajamouli: మహేష్ బాబు మూవీ తో రాజమౌళి పతనం ప్రారంభమైందా.. ఓటమి తెలియని డైరెక్టర్ కి మొదటిసారి ఓటమి పలకరించబోతోందా.. రాజమౌళి పతనం ప్రారంభమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు ప్రత్యక్షమవుతున్నాయి.. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి పై ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా అనగా నవంబర్ 15 రాత్రి 7 గంటలకు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
Rajamouli downfall began with Mahesh movie
రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఈవెంట్ చూడడానికి కొంతమంది అభిమానులతో పాటు జియో హాట్స్టార్ లో ఈ ఈవెంట్ ని లక్షలాది మంది వీక్షించారు. అయితే ఈ ఈవెంట్లో అన్ని బాగున్నప్పటికీ రాజమౌళి మాట్లాడిన మాట తీరు మాత్రం కొంతమంది హిందువులను హర్ట్ చేశాయి. రాజమౌళి ఈవెంట్లో మా నాన్న నన్ను హనుమంతుడు వెనక నుండి నడిపిస్తున్నాడు అని అన్నాడు. కానీ వారణాసి మూవీ గ్లింప్స్ అరగంట పాటు ఆగాయి. దాంతో నాకు దేవుడిపై నమ్మకం పోయింది.. మా నాన్న దేవుడు నా వెనుకుండి నడిపిస్తున్నాడు అంటే చాలా కోపం వచ్చింది. (Rajamouli)
Also Read: Rashmika: అందుకే నేను రాను.. వస్తే ఇలా చేస్తారు.. రష్మిక అసహనానికి కారణం..!
దేవుడు వెనకుండి నడిపిస్తే ఇలానే జరుగుతుందా అంటూ మాట్లాడారు. అయితే రాజమౌళి మాటలకు చాలామంది దేవుడి మీద భక్తి ఉన్నవాళ్లు ఫైర్ అవుతున్నారు.. రాజమౌళి నీ పతనం ప్రారంభమైంది.. నీకంటే ముందు ఉన్న ఎంతోమంది మహామహులే ఆ కాలగర్భంలో కలిసిపోయారు. ఇక వాళ్ల ముందు నువ్వెంత.. నీకు సక్సెస్ లు రావడంతో పొగరు తలకెక్కింది.. లేకపోతే దేవుడిపై అలాంటి కామెంట్ చేస్తావా..

నీ పతనం మహేష్ బాబు సినిమాతోనే ప్రారంభమైంది పో అంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు. దీంతో రాజమౌళి ని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నపోస్టులు చూసి మహేష్ అభిమానుల్లో కొత్త భయాన్ని నింపుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ నెగెటివిటీ పై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.(Rajamouli)





