Pooja Hegde: పాపం పూజాహెగ్డే.. జన నాయకన్ సినిమాలోనూ నిరాశేనా?

పూజా హెగ్డే విషయంలో అందరికీ ఒకటే ఆందోళన. ఒకప్పుడు వరుసగా సూపర్హిట్ సినిమాలు ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు ఫ్లాప్స్ ఎదుర్కుంటోంది. 2022 నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన ఆరు సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు విజయ్ నటించిన జన నాయకన్ ఫిక్స్ అవ్వడంతో మళ్ళీ పూజా హెగ్డే కెరీర్ ని ఫామ్ లోకి తీసుకువస్తుందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి రిపోర్ట్స్ చూస్తుంటే ఆమెకు మళ్ళీ నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

Pooja Hegde’s Unlucky Streak

విజయ్ లాస్ట్ సినిమా అయిన జన నాయకన్ ఎలాగైనా హిట్ అయ్యే చాన్స్ ఉంది. ఎందుకంటే ఇది అతని తొలి రాజకీయ ఎంట్రీ తర్వాత విడుదలైన చిత్రం. కానీ ఈ హిట్ క్రెడిట్ పూజాహెగ్డేకు రాకపోవచ్చు. అసలు విజయ్ నుంచి మాట్లాడే మాటలు మినహా పూజా గురించి ఎవరూ స్పెషల్ గా డిస్కస్ చెయ్యడం లేదు. దీంతో ఆమె ఈ సినిమాలో కేవలం సపోర్టింగ్ క్యారక్టర్ లా మాత్రమే కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దర్శకుడు వినోద్ తాజా ఇంటర్వ్యూ మాటలు పూజా ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చాయి. పూజా ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర పోషించింది. మొదట ఆ పాత్రకు చాలా సీన్లు ప్లాన్ చేసినప్పటికీ, సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్లు షూటింగ్ లో కూడా తీయలేదు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర మరికొన్ని సీన్స్ కట్ చెయ్యడంతో పూజా కనిపించే టైమ్ చాలా తక్కువయింది. ఈ డెసిషన్స్ వల్ల ఆమె ఇంపాక్ట్ ఏమైనా చూపించాలంటే కష్టమే అన్న మాట.

మరి చివరికి జన నాయకన్ ఆమె కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుందో లేదో చూడాలి. ఆమె నటనా ప్రతిభ ఉన్నప్పటికీ, ఈ సినిమాలో స్పేస్ తక్కువ ఇవ్వడం వల్ల ఆశించిన లాభం రాకపోవచ్చు. ఆశిస్తున్నాము ఈ సినిమా అయినా పూజాకు అదృష్టాన్ని తెచ్చేలా ఉంటుంది.

Share your love