Asia Cup 2025: ఆసియా కప్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్?

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ పై వేటు పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూఏఈ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే అలాంటి కులదీప్ యాదవ్ను తర్వాతి మ్యాచ్ లో పక్కకు పెడతారని.. ఆకాష్ చోప్రా లాంటి సీనియర్ ప్లేయర్లు చెబుతున్నారు. Asia Cup 2025

Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అదే ప్రధాన కారణం!!

Kuldeep Yadav ruled out of Asia Cup 2025

టీమిండియాలో ప్రస్తుత పరిస్థితి అలాగే ఉందని కూడా అంటున్నారు. తన అంచనా ప్రకారం టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో… ఆడించే అవకాశాలు లేనట్లు వెల్లడించారు ఆకాష్ చోప్రా. కులదీప్ యాదవ్ తలరాత బాగా లేకపోతే… తాను చెప్పిందే జరగడం ఖాయమంటూ బాంబు పేల్చారు. దీంతో గౌతమ్ గంభీర్ పైన సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. నిజంగానే కులదీప్ యాదవ్ తప్పుకుంటే… దానికి కారణం గౌతం గంబిరని అంటున్నారు. Asia Cup 2025

Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!

జట్టును ఆదుకునే ప్లేయర్లను గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే గౌతమ్ గంభీర్ ను కోచ్ బాధ్యతల నుంచి తప్పించి మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే టీమిండియా అగ్రశ్రేణి జట్టుగా మారుతుందని.. లేకపోతే బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోవడం పక్క అంటూ కామెంట్స్… చేస్తున్నారు అభిమానులు.

Also Read: Tablets: టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా…అయితే డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్టే!