UAE investments: రైతులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్..ఏపీ లోకి దుబాయ్ పెట్టుబడులు!!

వావ్… ఏపీలో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలకమైన గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. UAE investments తో ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కొత్త ఒడి ఏర్పడింది. దుబాయ్ ఫుడ్ క్లస్టర్ సహకారంతో ఏపీ నుంచి హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ఎగుమతులకు బాటలు వేశారు. ఈ ఒప్పందంపై సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సంతకాలు చేశారు.

UAE investments boost AP food processing

ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ను ఇంటర్నేషనల్ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అవకాశం లభిస్తుంది. అదే సమయంలో యూఏఈ నుంచి పెట్టుబడులు, ఫారిన్ ట్రేడ్ కు కూడా ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. రాష్ట్రంలో సమృద్ధిగా పండే మామిడి, అరటి, కోకో లాంటి ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇవి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి ఎగుమతి చేయడానికి సాయపడతాయి.

దావోస్ నుంచి ఆరు నెలల్లోనే యూఏఈ తన పెట్టుబడులను సాకారం చేసే దిశగా ముందుకు వచ్చింది. తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ ఏపీ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడింది. గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించి, ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది.

రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ, హార్టికల్చర్ రంగాల నుంచి 30% వస్తోందని సీఎం వివరించారు. 200 కు పైగా హార్టికల్చర్ క్లస్టర్లతో ఏపీ ఆక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ లాంటి పంటలను ఎగుమతి చేస్తోంది. ఈ ఒప్పందం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద బూస్ట్ అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu