Meher Raamesh: మెహర్ రమేష్ ఇంట విషాదం: సోదరి జ్యోతి కన్నుమూత

Tollywood director Meher Ramesh sister

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కు తీరని లోటు ఎదురైంది. ఆయన సోదరి మెహర్ జ్యోతి సుంకర గత కొన్ని రోజులుగా వైరల్ న్యుమోనియాతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Meher Raamesh sister passes away

ఈ విషయాన్ని మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పోస్ట్‌లో చిన్నప్పటి నుంచి అక్క తననెంతో ప్రేమగా చూసుకునేదని, అండగా నిలిచేదని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. తన కూతురు పెళ్ళిని దగ్గరుండి జరిపించిన ఆమెతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సంతోషకరమైన moments గురించి కూడా చెప్పారు.

తన life లో ఎంతో important person అయిన ఆమె ఇంత త్వరగా అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మెహర్ రమేష్ రాసుకొచ్చారు. ఆ దేవుడి సన్నిధికి ఆమె వెళ్ళిపోయింది అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అంటూ బాధను పంచుకున్నారు.

ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మెహర్ రమేష్ కుటుంబానికి ఈ కష్ట సమయంలో అందరూ అండగా ఉంటున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu