విద్యార్థుల నిరసనకు Kamal Haasan మద్దతు.. కుళ్లిన విద్యావ్యవస్థపై ఆవేదన!!

Kamal Hassan looking intense

నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతు తెలిపారు. NEET scam నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత విద్యావ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయిందని, ప్రతిభను కాకుండా కోచింగ్ సంస్థల నుంచి వచ్చే ఒత్తిడి, అవకతవకలే ఆధిపత్యం చేలాయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

NEET scam కి వ్యతిరేకంగా మద్దతు

విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ వాడటం తగదని కమల్ హసన్ అన్నారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకత్వంలో సంసద్ యాత్ర చేస్తున్న విద్యార్థులపై ఇలాంటి చర్యలు చోటు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు కాకుండా బారికేడ్లు, లాఠీలు ఎదురుపెడితే దేశం విఫలమైనట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నిరాహార దీక్షలో ఉన్న విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను కమల్ హసన్ ప్రత్యేకంగా ఉద్దేశించారు. దేశానికి మీ త్యాగం, పోరాటం చాలా అవసరమని, దయచేసి దీక్షను విరమించుకోవాలని విన్నవించారు. ఇప్పటికే ఈ ఆందోళనకు నసీరుద్దీన్ షా, ప్రకాశ్ రాజ్, సల్మాన్ ఖాన్, మాధవన్, షబానా అజ్మీ వంటి సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా కమల్ హాసన్ సైతం ఈ నిరసనలో భాగమయ్యారు.

విద్యార్థులను ఉద్దేశించి కమల్ హసన్ చివరిగా చెప్పిన మాటలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. మీరే అత్యుత్తములు, మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారని, ఇప్పుడు దేశం తన బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఈ సమస్యపై సెలబ్రిటీల మద్దతు విద్యార్థులకు మరింత బలంగా మారింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu