Kushboo: ‘నీ మొహం కడుక్కో పో’ అంటూ కుష్బూని అవమానించిన కమల్ హాసన్.!

Kamal Haasan insulted Kushboo

Kushboo: ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ రజినీకాంత్ కాంబోలో వచ్చిన సినిమాకి కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చి తర్వాత ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రకటించారు.అయితే సుందర్ సి కి సినిమా నచ్చకనో లేక మరే కారణం వల్లనో ఈ సినిమా నుండి తప్పుకుంటే సోషల్ మీడియాలో చాలామంది సుందర్ సి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

Kamal Haasan insulted Kushboo

ముఖ్యంగా రజినీకాంత్ అభిమానులు కుష్బూ గురించి అసహ్యంగా మాట్లాడంతో ఆమె తన నోటికి పని చెప్పి ట్రోలర్స్ కి షాక్ ఇచ్చింది. ఈ విషయం పక్కన పెడితే కమల్ హాసన్ కుష్బూ షూటింగ్ సెట్ కి వెళ్లిన సమయంలో మొహం కడుక్కొని రాపో అని మొఖం మీదే ఛీ కొట్టారట. మరి ఇంతకీ కుష్బూని కమల్ హాసన్ ఎందుకలా అన్నారు అనేది చూస్తే..(Kushboo)

Also Read: iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..ర‌వి ఇలా దొరికిపోయాడా ?

కుష్బూ కమల్ హాసన్ తో కలిసి మైకేల్ మదన కామరాజు అనే సినిమాలో నటిస్తున్న సమయంలో షూటింగ్ సెట్ కి ఫుల్ గా మేకప్ వేసుకొని వెళ్లిందట. అయితే అక్కడికి వెళ్లడంతోనే కమల్ హాసన్ కుష్బూని చూసి ముందు వెళ్లి మొహం కడుక్కొని రాపో నా శాలిని( సినిమాలో హీరోయిన్ పాత్ర) పాత్రకి మేకప్ ఉండదు అని చెప్పడంతో కుష్బూ వెంటనే వెళ్లి ముఖానికి వేసుకున్న మేకప్ అంతా కడుక్కొని వచ్చిందట.

Kamal Haasan insulted Kushboo

అయితే మొదట అలా మొహం మీదే మొహం కడుక్కొని రాపో అనగానే కుష్బూ షాక్ అయ్యి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడని భావించిందట.కానీ ఆ తర్వాసినిమాలో హీరోయిన్ కి మేకప్ ఉండదు అని కమల్ హాసన్ చెప్పడంతో అర్థం చేసుకొని వెంటనే వెళ్లి మేకప్ తీసేసుకుని నాచురల్ ఫేస్ తోనే ఆ సినిమాలో నటించిందట.(Kushboo)

Share your love