Malla Reddy: పార్టీ మార్పు పై మల్లారెడ్డి సంచలన ప్రకటన.. ఇక నోళ్ళు మూయల్సిందే!!

Malla Reddy

హైదరాబాద్: మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారడం లేదని, ఇవన్నీ ఊహాగానాలేనని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టంగా చెప్పేశారు.

BS Facts: Malla Reddy stays in BRS

శుక్రవారం బోయినపల్లి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. అక్కడ కేక్ కట్ చేసి, కేటీఆర్ 125 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలని విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తాను బీఆర్ఎస్ వీడుతున్నానని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. అవన్నీ ఫేక్ ప్రచారమని అన్నారు.

ఇటీవల ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నాడనే పెద్ద హడావిడి నడిచింది. కానీ ఈ ప్రచారానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం ద్వారా తన లాయల్టీని నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ లోనే తాను కంటిన్యూ చేస్తానని అండర్ లైన్ చేశారు.

మొత్తం మీద, మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్పష్టమైంది. ఇక మీదట కూడా తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని, పార్టీ బలపరచడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కమెంట్స్ తో అందరి మైండ్‌లోని డౌట్స్ క్లియర్ అయ్యాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu