

Kavitha: గులాబీ పార్టీ నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి దుమ్ము దులిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి తాజాగా కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలు అమ్మి పూలు అమ్మి వేల ఎకరాలు కబ్జా పెట్టాడని మాజీ మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదని…మేడ్చల్ లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. Kavitha
Kavitha slams brs mallareddy
కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉందని ఆగ్రహించారు కవిత. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా జరిగింది అంటే డంప్ యార్డ్ సమస్య కొంత తీరిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ సమస్య డబుల్, త్రిబుల్ అయ్యిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని పెన్షన్లు వచ్చాయి అంతేనని, అంతకు మించి అభివృద్ధి ఏమీ జరగలేదని నిప్పులు చెరిగారు. Kavitha
Also Read: Congress: చక్రం తిప్పిన షర్మిల..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ?
వారి కాలేజిలు, యూనివర్సిటీలు తప్ప ప్రజలు మాత్రం ఏమీ బాగుపడలేదని మాజీ మంత్రి మల్లారెడ్డి పై విరుచుకుపడ్డారు కవిత. మరి లేబర్ మినిస్టర్ గా ఉన్న మల్లారెడ్డి కనీసం మానవ హక్కుల గురించి ఆలోచించలేదని విమర్శలు చేశారు\ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. Kavitha
Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !







