పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం కొంచెం డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కష్టమైన టైమ్‌ను ఫేస్ చేస్తోంది. రాధేశ్యామ్, బీస్ట్ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్‌లో ఆశించిన రేంజ్లో రన్ అవ్వలేదు. ఈ పరిస్థితి ఆమె మార్కెట్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తోంది.
Pooja Hegde Career Down
తాజాగా విడుదలైన జన నాయకన్ సినిమా కూడా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో పూజా ఖాతాలో ఇంకో ఫ్లాప్ చేరినట్లైంది. సినీ వర్గాల టాక్ ప్రకారం, ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కూడా నిర్మాతలను ఆలోచింపజేస్తోంది. అంతేకాదు, కొన్ని సినిమాల్లో ఆమె స్క్రీన్ టైమ్ తగ్గించడం, ఎడిటింగ్ సమయంలో కీలక సీన్స్ కట్ అవడం లాంటి ఘటనలు కూడా డిస్కషన్ అవుతున్నాయి. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీలో కొత్త ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.
సినిమాల్లో వరుసగా డౌన్ ఫేజ్ ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. బ్రాండ్ ప్రమోషన్స్, ఫోటోషూట్స్, ఎండార్స్మెంట్స్ ద్వారా ఆమె ఇప్పటికీ మంచి ఇన్కమ్ రాబడుతోంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌కు ఆమె ఫస్ట్ చాయిస్‌గానే కొనసాగుతోంది.
ప్రస్తుతం పూజా చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ లేవు. అయితే, మాస్ మహారాజా రవితేజ సినిమా ఆమెకు గేమ్ ఛేంజర్ అవ్వొచ్చు. ఆగస్టులో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశముందని సమాచారం. రవితేజ సినిమా కన్ఫర్మ్ అయితే, అది పూజా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. వరుస పరాజయాల తర్వాత మళ్ళీ స్టార్ హీరోయిన్గా కంబ్యాక్ చేస్తుందేమో చూడాలి.





