
Raviteja: తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత వచ్చిన హీరోలలో శ్రీకాంత్, జగపతిబాబు, రవితేజ మొదటి స్థానాల్లో ఉంటారు.. వీరందరిలో రవితేజ కాస్త ఎక్కువగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ రవితేజకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమాన సంఘాలు ఉన్నాయి. అలాంటి రవితేజ ఒకప్పుడు ఏ సినిమాలో నటించిన అది తప్పకుండా విజయం సాధించేది.
Raviteja Comments on Anushka
అయితే ప్రస్తుత కాలంలో ఈయన సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. ఈ సందర్భంలోనే రవితేజ స్టార్ హీరోయిన్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి వరుస హిట్స్ అందుకున్న రవితేజ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో డల్ అయిపోయారు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. (Raviteja)
Also Read: Rashmika: రష్మిక పరువు తీసిన కాంతార బ్యూటీ.. టవల్లో చెప్పు పెట్టి కొట్టినట్లు.!
అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన వాల్తేరు వీరయ్య,క్రాక్ సినిమాలు కాస్త పరవాలేదు అనిపించిన మరికొన్ని సినిమాలు పూర్తిగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే తరుణంలో రవితేజ ఎప్పుడు హిట్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా రవితేజ కి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆయన హరీష్ శంకర్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రవితేజను ఇలియానా, త్రిష,శ్రీయ, అనుష్కలలో మీకు ఎవరు ఇష్టమని అడగగా రవితేజ వెంటనే అనుష్క పేరు చెప్పారు. వెంటనే యాంకర్ ఈ బీట్ కట్ చేసి ఇలియానా,త్రిష,శ్రీయకి పంపిస్తానని రవితేజతో నవ్వుకుంటూ అన్నారు. దీంతో రవితేజ పంపండి నాకు ఏమైనా భయమా అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఇది దీనికి సంబంధించిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Raviteja)





