Prabhas-Anushka: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్ అనుష్క.. ముహూర్తం ఫిక్స్ …?
Prabhas-Anushka: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సీక్రెట్ లవర్స్ ఉన్నారు.అలా టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ పేరు వినపడగానే ఎక్కువగా ప్రభాస్ అనుష్కల పేర్లే వినిపిస్తాయి.వీళ్ళ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ ల పేర్లు వినిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మాత్రం ప్రభాస్ అనుష్కకి సంబంధించి మాట్లాడుకుంటారు.వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా ఎప్పుడెప్పుడు చూద్దామని వేయికళ్లతో ఎదురు చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
Finally Prabhas-Anushka is going to tell good news
అయితే ఎట్టకేలకు వీరిద్దరికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫైనల్గా ప్రభాస్ అనుష్క ఒక్కటి కాబోతున్నారని,ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అంటూ టాక్ వినిపిస్తోంది.ఇక ప్రభాస్ అనుష్క ఒక్కటి కాబోతున్నారు… ముహూర్తం ఫిక్స్ అయింది అంటే అందరూ పెళ్లి కావచ్చు అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా రాబోతుందట.. ఇక ఆ సినిమా ఏంటంటే.. స్పిరిట్.. (Prabhas-Anushka)
Also Read: Kannappa Movie: వివాదంలో కన్నప్ప మూవీ.. పోస్టర్ పై హిందువులు ఫైర్.?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అలాగే ఈ ఏడాది సినిమాకి సంబంధించి షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం.అయితే చాలా రోజుల నుండి ప్రభాస్ కి హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే తాజాగా సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా అనుష్కని తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నారు అని,ఇక ఈయనకి జోడిగా అనుష్కనే బాగుంటుంది అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. దాంతో త్వరలోనే ఓ మంచి ముహూర్తం పెట్టి పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ అనుష్క అభిమానులు మరొకసారి తెరపైన వీరిద్దరి జోడి చూడాలని కోరుకుంటున్నారు.(Prabhas-Anushka)