
రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టేను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ రేణుక యారాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రంగనాథ్ తన విధుల్లో కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
Telangana High Court Stays Removal
గతంలో లోత్ కుంటలోని శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ భూ వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో రంగనాథ్‌పై ధిక్కార కేసు నమోదైంది. ఈ క్రమంలోనే జూలై 27న సింగిల్ జడ్జి రంగనాథ్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, సెప్టెంబర్ 1న డివిజన్ బెంచ్ ఆ తీర్పును నిలిపివేసింది. తాజాగా ఆ స్టేను మరోసారి పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా విచారణలో భాగంగా సదరు నిర్మాణ సంస్థకు అనుకూలంగా గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకుంది. అలాగే భూమి స్వాధీనం విషయంలో హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోకూడదనే ఆంక్షలను కూడా ధర్మాసనం తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ భూమి విషయంలో గతంలో ఉన్న పరిమితులు తొలగిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- YS Jagan: ప్రజాస్వామ్యాన్ని కాలరాశారంటూ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు.. ఏమన్నారంటే?
- Andhra Pradesh Civic: పులివెందులలో మీడియాపై దాడి.. అసలేం జరిగింది?
- Jagan Mohan: పులివెందులలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ.. జగన్ కోటను కూల్చిన చంద్రబాబు..
రంగనాథ్ దాఖలు చేసిన రెండు కోర్టు ధిక్కార అప్పీళ్లను పరిశీలించిన న్యాయస్థానం, తదుపరి విచారణను 2027 జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసులో పూర్తి స్థాయి వాదనలను కోర్టు వచ్చే ఏడాది విననుంది.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





