Telangana High Court: రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు.. ఎప్పటికంటే?

Telangana High Court: రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు.. ఎప్పటికంటే?

రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టేను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ రేణుక యారాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రంగనాథ్ తన విధుల్లో కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Telangana High Court Stays Removal

గతంలో లోత్ కుంటలోని శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ భూ వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో రంగనాథ్‌పై ధిక్కార కేసు నమోదైంది. ఈ క్రమంలోనే జూలై 27న సింగిల్ జడ్జి రంగనాథ్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, సెప్టెంబర్ 1న డివిజన్ బెంచ్ ఆ తీర్పును నిలిపివేసింది. తాజాగా ఆ స్టేను మరోసారి పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా విచారణలో భాగంగా సదరు నిర్మాణ సంస్థకు అనుకూలంగా గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకుంది. అలాగే భూమి స్వాధీనం విషయంలో హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోకూడదనే ఆంక్షలను కూడా ధర్మాసనం తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ భూమి విషయంలో గతంలో ఉన్న పరిమితులు తొలగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

రంగనాథ్ దాఖలు చేసిన రెండు కోర్టు ధిక్కార అప్పీళ్లను పరిశీలించిన న్యాయస్థానం, తదుపరి విచారణను 2027 జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసులో పూర్తి స్థాయి వాదనలను కోర్టు వచ్చే ఏడాది విననుంది.

మరిన్ని వార్తల కోసం..

Leave a Comment