
నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత టీటీడీ ఈఓగా ఉన్న ఆయనను ఈ అథారిటీకి ఛైర్మన్గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 31వ తేదీతో గత పాలకమండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Muddada Ravichandra Heads TTD Authority
ఈ స్పెసిఫైడ్ అథారిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి కె. కన్నా బాబు సభ్యులుగా వ్యవహరించనున్నారు. సోమవారం విడుదలైన జీవో ఎంఎస్ నంబర్ 658 ప్రకారం, టీటీడీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు ఉండే అన్ని అధికారాలు, విధులు ఈ అథారిటీకే దక్కుతాయి. దీని పదవీకాలం ఏడాది పాటు లేదా కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు కొనసాగుతుంది.
బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం 2024 నవంబర్ 1న నియమించిన సంగతి తెలిసిందే. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం టీటీడీ బోర్డు పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ గడువు 2026 అక్టోబర్ 31తో ముగియడం, చట్టంలో పదవీకాలం పొడిగింపునకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి:
- Rashi Phalalu: నవంబర్ 4 రాశిఫలాలు.. ఆ రాశుల వారికి అదృష్టం వరించనుందా?
- Rashi Phalalu: నవంబర్ 4న ఆ రాశుల వారికి పురోగతి.. ఎవరికంటే?
- Rashi Phalalu: వృషభ రాశి వారికి ఉద్యోగ పురోగతి.. గుడ్ న్యూస్! కారణాలివే!!
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొత్త పాలకమండలి నియామకంపై స్పష్టత రాలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ప్రభుత్వం పూర్తిస్థాయి బోర్డును ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు స్పెసిఫైడ్ అథారిటీ నేతృత్వంలోనే తిరుమల శ్రీవారి ఆలయ పాలన కొనసాగనుంది.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





