Muddada Ravichandra: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా.. ఎందుకంటే?

Muddada Ravichandra: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా.. ఎందుకంటే?

నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత టీటీడీ ఈఓగా ఉన్న ఆయనను ఈ అథారిటీకి ఛైర్మన్‌గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 31వ తేదీతో గత పాలకమండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Muddada Ravichandra Heads TTD Authority

ఈ స్పెసిఫైడ్ అథారిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి కె. కన్నా బాబు సభ్యులుగా వ్యవహరించనున్నారు. సోమవారం విడుదలైన జీవో ఎంఎస్ నంబర్ 658 ప్రకారం, టీటీడీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు ఉండే అన్ని అధికారాలు, విధులు ఈ అథారిటీకే దక్కుతాయి. దీని పదవీకాలం ఏడాది పాటు లేదా కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు కొనసాగుతుంది.

బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం 2024 నవంబర్ 1న నియమించిన సంగతి తెలిసిందే. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం టీటీడీ బోర్డు పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ గడువు 2026 అక్టోబర్ 31తో ముగియడం, చట్టంలో పదవీకాలం పొడిగింపునకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొత్త పాలకమండలి నియామకంపై స్పష్టత రాలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ప్రభుత్వం పూర్తిస్థాయి బోర్డును ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు స్పెసిఫైడ్ అథారిటీ నేతృత్వంలోనే తిరుమల శ్రీవారి ఆలయ పాలన కొనసాగనుంది.

మరిన్ని వార్తల కోసం..


Leave a Comment