Revanth Reddy: నవంబర్ 19న రూ. 5 లక్షల జీవిత భీమా పథకం ప్రారంభం.. అర్హతలు ఇవేనా?

Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు సిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ కారణంతో కుటుంబ పెద్ద మరణించినా మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Revanth Reddy Launches Indiramma Insurance

ఈ నవంబర్ 19వ తేదీన కేవలం బీమా పథకమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ నూతన సంక్షేమ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ బీమా సదుపాయం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లించేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు.

ఈ పథకం ద్వారా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేయగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఆర్థిక భరోసా దక్కేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పథకం అమలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు నవంబర్ 20 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటి సర్వే నిర్వహించి దరఖాస్తులను సేకరించనున్నాయి. ఆ విధంగా క్షేత్రస్థాయిలో కమిటీలు సేకరించిన దరఖాస్తులను ఆయా మండల తహశీల్దార్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరించి పరిశీలన చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఎలాంటి జాప్యం లేకుండా బాధితులకు రూ. 5 లక్షల బీమా సొమ్ము అందేలా అధికారిక యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా సంబంధిత గ్రామ సచివాలయం, మీసేవ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించడమైనది.

మరిన్ని వార్తలకోసం..


Leave a Comment