BRS: ఇందిరమ్మ చీరల బాగోతం..రూ. 450 కోట్లు స్కాం?

BRS: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. BRS

BRS Former Minister Errabelli Dayakar Rao comments on indiramma sarees

సిరిసిల్లలో నేతన్నలు నేర్చిన ఈ చీరలను అందిస్తోంది. అయితే ఈ చీరల పంపిణీ పై గులాబీ పార్టీ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చీరల పేరుతో 450 కోట్ల అప్పు తీసుకొని జేబులు నింపుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు ఎర్రబల్లి దయాకర్ రావు. ఒక్కో చీర 300 రూపాయలకు తయారు అయితే, 1200 కు తయారైనట్లు లెక్కలు చూపించి 450 కోట్లు అప్పు తీసుకున్నారని బాంబు పేల్చారు. BRS

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి…

అలాగే ఆ చీరలో 500 రూపాయలు చొప్పున మహిళా సంఘాల ఖాతాల నుంచి డబ్బులు కూడా కట్ చేస్తున్నట్లు నిప్పులు చెరిగారు ఎర్రబల్లి దయాకర్ రావు. వారి డబ్బులతోనే వారికి చీరలు పంపిణీ చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇలా కాంగ్రెస్ సర్కార్ ఏ కార్యక్రమం చేపట్టిన అవినీతి ఉంటుందని ఫైర్ అయ్యారు. BRS

Also Read: Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని…

https://twitter.com/gumpumestri/status/1993902905200631862?s=20
Share your love