Indiramma Saree: రేవంత్ రెడ్డికి మరో షాక్.. ఇందిరమ్మ చీరలపై కాంగ్రెస్ గుర్తులు?

Indiramma Saree: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. గ్రామస్థాయిలో మొదట ఇందిరమ్మ చీరల పంపిణీని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో ఈ చీరలు నేయించి మరి ఇప్పుడు అందజేస్తుంది. వాస్తవంగా బతుకమ్మ సమయంలోనే ఈ చీరలు ఇవ్వాల్సి ఉంది. కానీ చీరల ఆర్డర్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆలస్యం చేయడంతో బతుకమ్మ పండుగ సమయానికి ఆ చీరలు రెడీ కాలేదు. Indiramma Saree

Telangana Govt Launches Indiramma Saree Distribution

ఇక ఈ నెలలో చీరల పంపిణీ కొనసాగుతోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు గులాబీ పార్టీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న ఇందిరమ్మ చీరలపై తెలంగాణ మహిళా మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త లేని ఇందిరమ్మ పేరు ఈ పథకానికి పెట్టడమేంటని మొదటి నుంచి ఫైర్ అవుతున్నారు. Indiramma Saree

Also Read: Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?

ఇక ఇప్పుడు ఇందిరమ్మ కట్టుకున్న తరహాలోనే చీరలు ఉండటంపై కూడా పెదవి విరుస్తున్నారు. ఇక ఆ చీరలపై కాంగ్రెస్ జెండా గుర్తులు కూడా దర్శనమిచ్చాయి. దీనిపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. చీరలపై కూడా కాంగ్రెస్ గుర్తులు ఎందుకు అని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. Indiramma Saree

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

https://www.instagram.com/reel/DRZEFkMkZG3/?igsh=MTN1ZWZ5NmdtYmxtNw==
Share your love