Modi KCR Revanth: మోదీ, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి యుద్ధం.. సునామీ గ్యారెంటీనా?

Modi KCR Revanth: మోదీ, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి యుద్ధం.. సునామీ గ్యారెంటీనా?

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజల బలంతో వచ్చే రాజకీయ సునామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను కొట్టుకుపోయేలా చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Modi KCR Revanth CM Speech

గత ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులు, తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత 34 నెలల్లో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలను కేవలం పాత అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వచ్చిందని వెల్లడించారు. బహిరంగ చర్చకు రమ్మంటే ప్రతిపక్ష నేతలు ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతున్నారని, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ తర్వాత ‘ప్రజా బలం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ తీరును ఎద్దేవా చేస్తూ, గడ్డం పెరగడానికి 50 ఏళ్లు పట్టిందని, మరి బుద్ధి రావడానికి ఇంకెంత కాలం పడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవి కూడా చదవండి:

కొడంగల్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన వెంటే ఉన్న వారికి అండగా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలే శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఢిల్లీలో మోదీ అయినా, రాష్ట్రంలో కేడీ (కేసీఆర్) అయినా తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment