KTR: సంక్రాంతి పూట గోవాకు వెళ్ళిన కేటీఆర్ ఫ్యామిలీ ?

KTR
KTR
KTR

KTR: సంక్రాంతి పండుగ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట సంతోషాన్ని నింపింది. అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి, సందడి వాతావరణం నడుమ పండుగ చేసుకున్నారు. ఇక ఆదివారం నుంచి మళ్లీ పట్నం బయలుదేరనున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ ఫ్యామిలీ పై షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. KTR

KTR family went to Goa for Sankranti

కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు కేటీఆర్ ఆయన ఫ్యామిలీతో సంక్రాంతి పూట గోవాకు వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి సంబంధించిన మాజీ నాయకురాలు ఆశాప్రియ దీనికి సంబంధించిన పోస్ట్ చేయడం జరిగింది. పండుగ పూట అందరూ గ్రామాల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటే.. కేటీఆర్ మాత్రం ఫారెన్ కల్చర్ తరహాలో తన ఫ్యామిలీని గోవాకు తీసుకువెళ్లినట్లు పోస్ట్ పెట్టింది. KTR

Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా

అయితే దీనికి గులాబీ పార్టీ నేతలు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ గోవాకు వెళితే సంక్రాంతి పండుగ రోజు తన తండ్రి కెసిఆర్ తో పాంప్ హౌస్ లో పండుగ ఎలా చేసుకుంటాడో? కేటీఆర్ భార్య, కొడుకు అలాగే కుమార్తె కూడా కేసీఆర్ దగ్గరే ఉన్నారు కదా ? గోవాకు ఎప్పుడు వెళ్లాడు? ఒక రోజుకి గోవా నుంచి మళ్లీ వచ్చేసాడా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు కౌంటర్ ఇస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. మొత్తానికి కెసిఆర్ తో కేటీఆర్ ఫ్యామిలీ ఫోటో దిగి వైరల్ చేయడంతో.. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. KTR

Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్‌.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu