Prabhas Spirit: స్పిరిట్ రిలీజ్ అప్పుడే.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!!

Prabhas Spirit Shooting and Release Plans

Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అయితే, ప్రభాస్ అభిమానులను ఎక్కువగా ఎగ్జైట్ చేస్తున్న సినిమా ‘స్పిరిట్’, దీనిని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారు.

Prabhas Spirit Shooting and Release Plans

స్పిరిట్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సినిమా షూటింగ్ 2025 చివరిలో మొదలవుతుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది.

తాజా సమాచారం ప్రకారం, స్పిరిట్ మూవీ 2027 ద్వితీయార్ధంలో విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా, ప్రభాస్ మునుపటి ప్రాజెక్టుల కంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన, స్పిరిట్ మూవీ షూటింగ్ 2025 చివర్లో ప్రారంభమై 2027 నాటికి పూర్తి కానుంది. అయితే, అధికారిక విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *