The Paradise Movie: నాని యాక్షన్ అవతార్.. త్వరలో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్!!

The Paradise Movie: నాని అభిమానులకు గుడ్ న్యూస్! యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ త్వరలో విడుదల కాబోతోంది. యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కి పక్కా ట్రీట్ కానుంది. ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, త్వరలో విడుదలయ్యే గ్లింప్స్ మరింత క్రేజ్‌ను పెంచనుంది.
The Paradise Movie February 20 Glimpse
సినిమా మేకర్స్ నాని అభిమానులను సర్‌ప్రైజ్ చేసేందుకు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్లింప్స్ దాదాపుగా రెడీ కాగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (background score) ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతానికి అనిరుధ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉండగా, స్కోర్ పూర్తికాగానే గ్లింప్స్ విడుదల కానుంది.
ప్లాన్ ప్రకారం, ది ప్యారడైజ్ గ్లింప్స్ ఫిబ్రవరి 20, 2025న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ (Pratyangira Cinemas) ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేసినట్లు సమాచారం. టాక్ ప్రకారం, ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ (highest overseas deal) గా నిలవనుంది.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే, రాబోయే గ్లింప్స్‌లో ఈ సీక్రెట్ రివీల్ అవుతుందా? అనేది ఆసక్తిగా మారింది. నాని అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.