సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక్కడ ఎవరి కుంపటి వారిదేనని, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించి సత్కరించలేదని అల్లు అరవింద్ అన్నారు. ఇండస్ట్రీ స్పందించకున్నా సైమా గుర్తించి సత్కారం చేసిందని ఆయన చెప్పారు.
సైమా సక్సెస్ ఫుల్ గా 13వ ఎడిషన్ కి చేరుకోవడం చాలా ఆనందంగా వుందన్న అల్లు అరవింద్..నేషనల్ అవార్డ్ విన్నర్స్ ని సైమా సత్కరించడం అభినందనీయమని చెప్పారు. ఇండస్ట్రీలో ఆ నలుగురు అని చెప్పుకునే వారిలో ఒకరిగా ఉన్న అల్లు అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరిచే విషయమే. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ స్పందించలేదనేది అల్లు అరవింద్ మనసులో ఉండే ఇలాంటి కామెంట్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది.





